ఘనంగా జూ పార్క్ చింపాంజీ పుట్టిన రోజు

Celebrates Chimpanzee Suzi’s 34th Birthday :హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూ పార్క్‌లో సంబరాలు అబరాన్ని అంటాయి. ఓ చింపాంజీ బర్త్ డేను జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇక్కడి వచ్చేవారిని ఆకట్టుకునే ఈ సుజి అనే చింపాజీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ఇక్కడికి వచ్చినవారిని తన ఆటలతో అలరిస్తుంటుంది. హైదరాబాద్ జూ పార్క్‌కు సూజీ ప్రత్యేక ఆకర్షణ. సుజి.. 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ ప‌డిలోకి అడుగు పెట్టింది. 2011 సంవత్సరంలో […]

  • Sanjay Kasula
  • Publish Date - 11:15 pm, Wed, 15 July 20
ఘనంగా జూ పార్క్ చింపాంజీ పుట్టిన రోజు

Celebrates Chimpanzee Suzi’s 34th Birthday :హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూ పార్క్‌లో సంబరాలు అబరాన్ని అంటాయి. ఓ చింపాంజీ బర్త్ డేను జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇక్కడి వచ్చేవారిని ఆకట్టుకునే ఈ సుజి అనే చింపాజీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ఇక్కడికి వచ్చినవారిని తన ఆటలతో అలరిస్తుంటుంది. హైదరాబాద్ జూ పార్క్‌కు సూజీ ప్రత్యేక ఆకర్షణ.

సుజి.. 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ ప‌డిలోకి అడుగు పెట్టింది. 2011 సంవత్సరంలో సహారా గ్రూప్ సంస్థ జూ పార్కుకు సుజీని బహుమతిగా ఇచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. మంచి ఆరోగ్యంతో ఉన్న చింపాజీ

కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సుజి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. సుజి కోసం పండ్లు మరియు చపాతీలతో ఫ్రూట్ కేక్‌ను జూ సిబ్బంది తయారు చేశారు. సుజి పుట్టిన రోజు వివరాలను జూ అధికారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫ్రూట్ కేక్‌తోపాటు  రెండు కొత్త బ్లాకెట్‌లను అందించాని జూ పార్క్ అధికారులు వెల్లడించారు.