AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మో.. మెడలో అంత పెద్ద పామా..! అరుదైన కొండచిలువతో రోడ్డుపైనే యువతి కెవ్వు కేక డ్యాన్స్..!

హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో ఓ యువతి కొండచిలువతో డ్యాన్స్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. యూసుఫ్‌గూడలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, ఇండియన్ రాక్ పైథాన్‌ను వినోదం కోసం ఉపయోగించారు. సమాచారం అందుకున్న GHSPCA బృందం వెంటనే కొండచిలువను సురక్షితంగా రక్షించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఇది నేరం.

Watch: అమ్మో.. మెడలో అంత పెద్ద పామా..! అరుదైన కొండచిలువతో రోడ్డుపైనే యువతి కెవ్వు కేక డ్యాన్స్..!
Hyderabad Python Dance
Balaraju Goud
|

Updated on: Sep 21, 2026 | 5:43 PM

Share

హైదరాబాద్: వినాయక నిమజ్జన సందడి మధ్య ఓ వింత దృశ్యం అందరినీ షాక్‌కు గురి చేసింది. మెడలో భారీ కొండచిలువను వేసుకుని ఓ యువతి రోడ్డుపైనే డ్యాన్స్ చేయడం చూసినవారిని అవాక్కయ్యేలా చేసింది! యూసుఫ్‌గూడ జవహర్‌నగర్, మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో, హఠాత్తుగా ఓ యువతి మెడలో పెద్ద పామును వేసుకుని స్టెప్పులు వేయడం భయభ్రాంతులకు గురి చేసింది.

ఈ వింత విన్యాసాన్ని చూసేందుకు జనం క్షణాల్లోనే అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కెవ్వు కేకలు, చప్పట్లతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. యువతి చేతిలోని ఆ పాము మామూలుది కాదు.. అది అంతరించిపోతున్న జాతికి చెందిన ‘ఇండియన్ రాక్ పైథాన్’ (Python molurus)! వినోదం కోసం బహిరంగంగా వాడిన ఈ అరుదైన జీవి గురించి తెలియగానే జంతు ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న వెంటనే GHSPCA బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. యువతి నుండి కొండచిలువను సురక్షితంగా స్వాధీనం చేసుకున్న బృందం, దాన్ని రక్షించి తరలించింది.

చట్టం ఏం చెబుతోంది?

భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-I కింద ఇండియన్ రాక్ పైథాన్‌కు అత్యున్నత స్థాయి రక్షణ ఉంది. పాములను బహిరంగ ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలకు వాడటం పూర్తిగా చట్టవిరుద్ధం. వన్యప్రాణిని పట్టుకోవడం, హాని చేయడం, అక్రమ రవాణా చేయడం లేదా వ్యాపారం చేయడం వంటివి చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. కాగా, సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

నిమజ్జన సందడి మధ్య మొదలైన ఈ వింత ప్రదర్శనకు చివరికి తెర పడింది. పామును సురక్షితంగా అధికారులు రక్షించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వినోదం కోసం వన్యప్రాణులను వాడే ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us