పది రూపాయల కోసం ఓ పండ్ల వ్యాపారిని హత్య చేసిన కేసులో నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ షాకీబ్ అలీ.. కూకట్‌పల్లి కృష్ణవేణి నగర్ లో నివాసం ఉంటూ తులసినగర్ లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన పండ్లను విక్రయిస్తున్న షాకీబ్ అలీ దగ్గరికి ఎల్లమ్మబండకు చెందిన యండి నసీమ్, సమీర్ ఖాద్రీ, మరో బాలుడితో కలిసి పైనాపిల్, ద్రాక్షాపళ్లను కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో పది రూపాయలు పండ్లకు ఇవ్వాలని షాకీబ్ అలీ కోరాడు. ఇదే విషయంలో షాకీబ్ అలీకి నసీమ్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
దీంతో నసీమ్ తన స్నేహితులకు ఫోన్‌చేసి స్నేహితులను పిలిపించి. అందరు కలిసి షకీబ్ అలీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షకీబ్ చికిత్స పొందుతూ ఈనెల 3వ తేదీన మృతి చెందాడు. హత్యకు పాల్పడిన ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ సురేందర్ రావు తెలిపారు.