హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా బయటపడింది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా… గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ముగ్గురు యెమన్ దేశస్తులు సహా నలుగురు పట్టుబడ్డారు. వారి నుంచి 30 గ్రాముల MDMA, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్ దందాను నడుపుతున్నారు. టోలీచౌకీలో నివాసం ఉంటున్న యెమెన్ దేశస్తులు.. న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తీసుకువచ్చినట్టుగా గుర్తించారు. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. అబ్దుల్లా గియాస్, అల్వర్ అలీ, అబ్దుల్ రెహమాన్, సలీంను అరెస్టుచేశారు.