హైదరాబాద్ పోలీసులకు చిక్కిన బడా గుట్కాగ్యాంగ్

|

Oct 15, 2020 | 1:32 PM

నిషేధిత గుట్కా.. సరఫరా, పంపిణీ చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరాలు వెల్లడించారు. 63 లక్షల 96 వేల రూపాయల గుట్కా ను సీజ్ చేశామని అంజనీ కుమార్ చెప్పారు. మొత్తం 41 గుట్కా బ్యాగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. హిందూస్థాన్ ట్రాన్స్ పోర్ట్ నుండి తరలిస్తున్న 10 గుట్కా బ్యాగ్స్ ను కూడా పట్టుకున్నామన్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం […]

హైదరాబాద్ పోలీసులకు చిక్కిన బడా గుట్కాగ్యాంగ్
Follow us on

నిషేధిత గుట్కా.. సరఫరా, పంపిణీ చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరాలు వెల్లడించారు. 63 లక్షల 96 వేల రూపాయల గుట్కా ను సీజ్ చేశామని అంజనీ కుమార్ చెప్పారు. మొత్తం 41 గుట్కా బ్యాగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. హిందూస్థాన్ ట్రాన్స్ పోర్ట్ నుండి తరలిస్తున్న 10 గుట్కా బ్యాగ్స్ ను కూడా పట్టుకున్నామన్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం తో అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారని సీపీ చెప్పారు. ఈ ముఠాకు సంబంధించి మీర్జాల్ ఫజిల్ హుస్సేన్, దస్తగిరి అబ్బాస్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.

గుట్కా గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా త్వరలో పట్టుకుంటామని సీపీ తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ పేరుతో గుట్కా ను సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు తమ వంతు కృషి సల్పారని సీపీ చెప్పుకొచ్చారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేసామని.. జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసుకుని లోకల్ పోలీస్ అధికారులు సేవలు అందించారని అన్నారు. రెండు రోజులుగా ప్రజలు సేవలందించిన పోలీస్ అధికారులు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.