AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరి డెడ్ బాడీ

కరోనా బాధితులకు సంజీవినిగా మారిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి సంచలనంగా మారింది. ఈసారి చనిపోయిన కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి.

గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరి డెడ్ బాడీ
Balaraju Goud
|

Updated on: Jun 10, 2020 | 12:39 PM

Share

కరోనా బాధితులకు సంజీవినిగా మారిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి సంచలనంగా మారింది. ఈసారి చనిపోయిన కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దీంతో బంధువులు శ్మశానం దాకా తీసుకెళ్లారు. తీరా సమాధి చేస్తుండగా తప్పును గుర్తించారు. దీంతో డెడ్ బాడీని వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తిరిగి తీసుకొచ్చేశారు. తర్వాత అధికారులు వాళ్లకు సంబంధించి వ్యక్తి డెడ్ బాడీని అప్పగించారు. హైదరాబాద్‌లోని బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన ఓ కరోనా పేషేంట్ (48) గాంధీ హాస్పిటల్స్ లో చనిపోయారు. హాస్పిటల్ స్టాఫ్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించగా.. వాళ్లు శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. క డసారి చూసేందుకు ఆ వ్యక్తి భార్య డెడ్ బాడీ మొఖం చూసింది. దీంతో షాక్ అయిన తన భర్తది కాదని గుర్తించింది. దీంతో బాడీని అంబులెన్స్​లో గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. డాక్టర్లు, హెల్త్​ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మార్చురీలో వాళ్లకు సంబంధించిన వ్యక్తి బాడీని గుర్తించడంతో శాంతించారు. గాంధీ హాస్పిటల్‌కు భారీగా కరోనా పేషెంట్లు వస్తుండటంతో.. డాక్టర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని దీంతో పొరపాటు జరిగి ఉండొచ్చని అంటున్నారు ఆస్పత్రి అధికారులు.

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..