ఈ ఏడాది పుస్తక ప్రియులకు నిరాశే ఎదురైంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్డేడియంలో ప్రతి సంవత్సరం జరిగే జాతీయ పుస్తక ప్రదర్శన వాయిదా పడింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష కార్యదర్శులు జూలూరీ గౌరీ శంకర్, కోయ చంద్రమోహన్ ఈ ఏడాది జరిగే బుక్ ఫెయిర్‌ను జరపకుండా.. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కరోనా అనంతరం సాదారణ పరిస్తితులు నెలకొన్న తర్వాత ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.