హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..

నేరాలను గుర్తించి నిరోధించే ఉద్దేశ్యంతో బహిరంగ ప్రదేశాల పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఉపయోగించే నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. 3 లక్షలకు పైగా నిఘా నేత్రాలున్న నేపథ్యంలో దేశంలో

హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 11:02 AM

నేరాలను గుర్తించి నిరోధించే ఉద్దేశ్యంతో బహిరంగ ప్రదేశాల పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఉపయోగించే నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. 3 లక్షలకు పైగా నిఘా నేత్రాలున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా టాప్‌ 20 నగరాల్లో 16వ స్థానాన్ని సంపాదించుకుంది. టాప్‌ 20లో లండన్‌ (3వ స్థానం), హైదరాబాద్‌ తప్ప మిగతావన్నీ చైనాలోని నగరాలేనని యూకేకు చెందిన కంపారిటెక్‌ సర్వే వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌–50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్‌ లభించాయి. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రతి 1,000 మందికి సుమారుగా 30 కెమెరాలున్నాయి. ప్రతి 1,000 మందికి 25.52 కెమెరాలతో చెన్నై 21వ స్థానంలో నిలిచింది. 1,000 మందికి 14.18 కెమెరాలతో ఢిల్లీ 33వ స్థానంలో నిలిచింది. ముంబైలో ప్రతి 1,000 మందికి కేవలం 0.48 కెమెరాలు మాత్రమే ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.