అహమ్మదాబాద్ లో అతిపెద్దదైన ‘క్రికెట్ స్టేడియం’ పేరును ‘నరేంద్ర మోదీ స్టేడియం’ గా పేరు మార్పుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో బాటు గౌరవ్ పాంధీ అనే మరో నేత కూడా వ్యంగ్యంగా స్పందించారు. ‘హమ్ దో, హమారే దో’ అనే తన విమర్శను రాహుల్ మళ్ళీ ప్రస్తావించారు. ‘నరేంద్ర మోదీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, విత్ జే షా'( హోం మంత్రి అమిత్ షా కుమారుడు ) ప్రిసైడింగ్ ‘ అని ఆయన ట్వీట్ చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రాహుల్ ఇటీవల తరచూ ఇదే పదాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలో వ్యవసాయం నలుగురి చేతిలోనే ఉందని, వారే ఈ రంగాన్ని శాసిస్తున్నారని అంటూ ఆయన.. పరోక్షంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అదానీ, రిలయన్స్ అధినేతలను పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ స్టేడియం పేరు మార్పు విషయంలో కూడా ఆయన ఇదే పదాన్ని వాడారు. ఇక శశిథరూర్.. మరో విధంగా వ్యాఖ్యానిస్తూ.. ఆర్ ఎస్ ఎస్ ను బ్యాన్ చేయాలంటూ నాటి మాజీ హోంమంత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తుకు వఛ్చి బహుశా ప్రభుత్వం ఈ స్టేడియం పేరు మార్చినట్టు కనిపిస్తోందన్నారు.
(మొదట దీన్ని సర్దార్ వల్లభ భాయ్ స్టేడియంగా వ్యవహరించారు.) ఇక ట్రంప్ లేదా అలాంటి విదేశీ నేత ఎవరైనా వస్తే అడ్వాన్స్ బుకింగ్ గా ఇలా పేరుమార్చి ఉండవచ్చు అని కూడా శశిథరూర్ వ్యాఖ్యానించారు. గౌరవ్ పాంధీ అనే మహిళా నేత.. సర్దార్ పటేల్ పేరును తొలగించి నరేంద్ర మోదీ అని పేరు పెట్టడం పటేల్ ని ఘోరంగా అవమానించినట్టేనని, మీ అహంకారానికి హద్దులు ఉన్నాయా మోదీజీ..సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇది నరేంద్ర మోదీ కలల కోర్కె అని, ఇలా పేరు పెట్టినందువల్ల ఆయన కలను సాకారం చేసినట్టయిందని హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. లక్షా 32 వేలమంది పట్టే ఇంత పెద్ద స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదని పేర్కొన్నారు.
Beautiful how the truth reveals itself.
Narendra Modi stadium
– Adani end
– Reliance endWith Jay Shah presiding.#HumDoHumareDo
— Rahul Gandhi (@RahulGandhi) February 24, 2021