AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: స్కూటీ స్టార్ట్ చేసేలోపే షాక్.. లోపల దూరిన భారీ పాము.. వీడియో వైరల్‌..!

Snake: ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో పాములు ఆశ్రయం కోసం బైక్‌లు, స్కూటీల ఇంజిన్ భాగాలు లేదా ముందు వైపు ఖాళీ ప్రదేశాల్లోకి చొరబడే అవకాశం ఉందని స్నేక్ క్యాచర్లు హెచ్చరిస్తున్నారు. వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని, ఇలాంటి..

Snake: స్కూటీ స్టార్ట్ చేసేలోపే షాక్.. లోపల దూరిన భారీ పాము.. వీడియో వైరల్‌..!
Snake
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 12:43 PM

Share

Snake: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో స్థానికులను హడలెత్తించిన ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తికి సంబంధించిన స్కూటీలోకి భారీ పాము చొరబడడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ధర్మపురి కేంద్రంలో పార్క్ చేసి ఉన్న ఓ స్కూటీ లోపలికి పాము వెళ్లడాన్ని గమనించిన స్థానికులు భయంతో కేకలు వేశారు. వాహనం చుట్టూ జనం గుమిగూడడంతో కాసేపు అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్థానిక స్నేక్ క్యాచర్‌కు (పాములు పట్టే వ్యక్తి) సమాచారం అందించాడు.

ముందు భాగం విప్పి.. జాగ్రత్తగా బయటకు తీశాడు. స్కూటీ లోపల దాక్కున్న పామును పట్టుకోవడం అంత సులువు కాలేదు. దీంతో ఆయన అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, స్కూటీ ముందు భాగాన్ని (ఫ్రంట్ ప్యానల్) స్క్రూ డ్రైవర్‌తో విప్పాడు. పామును బయటకు తీశాడు. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారాయి.

వాహనదారులకు నిపుణుల హెచ్చరిక:

ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో పాములు ఆశ్రయం కోసం బైక్‌లు, స్కూటీల ఇంజిన్ భాగాలు లేదా ముందు వైపు ఖాళీ ప్రదేశాల్లోకి చొరబడే అవకాశం ఉందని స్నేక్ క్యాచర్లు హెచ్చరిస్తున్నారు. వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా స్నేక్ క్యాచర్ ను పిలవాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us