Nani’s Shyam Singha Roy: ‘ఆచార్య’ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని ఈ మధ్యేగా చెప్పుకున్నాం. చిరు సినిమా కోసం ఏకంగా 20 ఎకరాల్లో టెంపుల్ టౌన్ సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఆ గ్రాండ్ సెట్‌ను చూసి మెస్మరైజ్ అయిన మెగాస్టార్ స్వయంగా సెట్ వీడియో అభిమానుల కోసం షేర్ చేశారు. అయితే మెగాస్టార్‌ను ఫాలో అవుతున్నారో.. లేక ముందే అలా డిసైడ్ అయ్యారో తెలియదు గాని నాని కూడా ఓ భారీ సెట్‌లో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు.
అవును మరీ మెగాస్టార్ రేంజ్‌లో కాకపోయినా… నాని రేంజ్‌కు మెగా అనిపించే సెట్ హైదరాబాద్‌లో రెడీ అవుతోంది. దాదాపు 15 ఎకరాల్లో కోల్‌కతా సెట్ వేస్తున్నారు. ఇదంతా నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ కోసం. పీరియాడిక్ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీ కోసం వింటేజ్ కోల్‌కతాను హైదరాబాద్‌లో సృష్టిస్తున్నారు. ‘బాహుబలి’ని తలపించేలా ఈ భారీ సెట్‌కు హంగులద్దుతున్నారట.
నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ కోసం ఈ భారీ సెట్ రెడీ అవుతోంది. సెట్ అంటే ఏదో ఆషామాషీగా కాదు… ఏకంగా ఓ చిన్న సినిమాకు పెట్టే బడ్జెట్ మొత్తాన్ని ఈ సెట్ మీద ఖర్చు పెడుతున్నారట. అన్నట్టూ… ఈ సెట్‌కి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా…. అక్షరాలా ఆరు కోట్లు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read :
APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్లైన్లోనే !