యూపీలో పట్టాలు తప్పిన రైలు..తప్పిన ప్రాణ నష్టం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. హావ్‌డా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.  క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బాధిత […]

యూపీలో పట్టాలు తప్పిన రైలు..తప్పిన ప్రాణ నష్టం

Updated on: Apr 20, 2019 | 8:43 AM

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. హావ్‌డా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.  క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి  కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.