AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఫ్రిజ్ కింద బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా ? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లొ తరిమికొట్టండి

వర్షాకాలంలో ఇంట్లో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏదైనా అంది బొద్దింకలు. ఇవి కొన్ని సార్లు కిచెన్‌ నుంచి ప్రిజ్‌లోకి చేరి మన అనారోగ్యానికి కారణం అవుతాయి. కాబ్టటి వీటి భారీ నుంచి తప్పించుకోవాలంటే.. మొదటి అవి ఇంట్లో ఎలా వస్తున్నాయి. అవి రాకుండా ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి బొద్దింకలు ఇంట్లోకి రావడానికి కారణాలు.. వాటిని తరమికొట్టే చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

Kitchen Tips: ఫ్రిజ్ కింద బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా ? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లొ తరిమికొట్టండి
How To Get Rid Of Cockroaches In Refrigerator
Anand T
|

Updated on: Jun 14, 2026 | 3:21 PM

Share

చాలా మంది ఇంట్లో ఎదుర్కొనే ప్రధాన సమస్య బొద్దింకలు. ఇవి మన ఆహారంపై తిరిగి అనారోగ్యానికి గురిచేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఫ్రిజ్ లోపలకి కూడా వస్తాయి. అయితే ఇలా ప్రిజ్‌లోకి బొద్దింకలు రావడానికి కేవలం అపరిశుభ్రత మాత్రమే కారణం కాదని.. అక్కడ ఉండే తేమ, వేడి వాతావరణం, చిన్న చిన్న ఆహార కణాలు కూడా వాటిని ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎప్పికప్పుడూ క్లీన్ చేయకపోతే.. అవి కిచెన్ అంతా వ్యాపించి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

ప్రిజ్‌లోకి బొద్దింకలు రాకుండా ఎలా క్లీన్ చేయాలి?

పవర్ సప్లై ఆపండి: మీరు ప్రిజ్‌ను క్లీన్ చేయాలి అనుకుంటే ముందు ఫ్రిజ్ ప్లగ్‌ను తప్పనిసరిగా తొలగించండి. ఎందుకంటే ప్లగ్‌ఇన్ చేసి ఉంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.

ఆహార పదార్థాలను తొలగించండి: ఫ్రిజ్‌లోని ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే వాటిని బయటకు తీయండి, అలాగే ట్రేలు, డ్రాయర్లను బయటకు తీసి.. ఎక్కడైనా కుళ్ళిన ఆహారం లేదా, ఉందేమో చూసి క్లీన్‌గా శుభ్రం చేయండి.

గోరువెచ్చని నీటితో క్లీన్: తర్వాత మైల్డ్ లిక్విడ్ సోప్, గోరువెచ్చని నీటితో కలిపి ఒక క్లాత్ తీసుకొని ఫ్రిజ్ లోపలి, బయటి భాగాలను నీటుగా తుడవండి. ముఖ్యంగా రబ్బర్ సీల్స్, వెజిటబుల్ బాక్స్, మూలలను బాగా క్లీన్ చేయండి. ఎందుకంటే అక్కడే కుల్లిన ఆహార కణాలు మిగిపోయేవి.

ఫ్రిజ్ వెనుక భాగం: ప్రిజ్ క్లీన్ చేసేప్పుడు చాలా మంది మర్చిపోయేది ప్రిజ్‌ వెనక క్లీన్ చేయండి. కానీ ఇక్కడే బొద్దింకలు ఎక్కవగా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉండటం వల్ల బొద్దింకలు ఇక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయి. కాబట్టి ఫ్రిజ్‌ను గోడ నుండి కాస్త ముందుకు జరిపి, అక్కడ పేరుకుపోయిన దుమ్ము, ఆహార కణాలను శుభ్రం చేయండి.

బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఏం చేయాలి?

గోడల పగుళ్లను పూడ్చండి: సాధారణంగా గోడలకు ఉండే పగుళ్ల ద్వారా లేదా రంద్రాల ద్వారా బొద్దింకలు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఫ్రిజ్ పరిసరాల్లోని గోడలు, పైపులు, ఎలక్ట్రికల్ సాకెట్ల చుట్టూ ఏవైనా పగుళ్లు లేదా రంధ్రాలు ఉంటే వాటిని వెంటనే సిలికాన్ సీలెంట్ లేదా సిమెంట్‌తో మొత్తం మూసివేయండి.

ఆహారాన్ని దాచండి: ఇంట్లో ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా మూత ఉన్న డబ్బాల్లోనే ఉంచండి. పండ్లు, కూరగాయలు లేదా మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు. పొరపాటున ఏవైనా ఆహారాలు కింద పడితే వాటిని వెంటనే క్లీన్ చేయండి.

డస్ట్‌బిన్ నిర్వహణ: చెత్తబుట్ట నిండిపోతే బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రోజువారీ కిచెన్ వేస్ట్‌ను క్రమం తప్పకుండా బయట పడేయండి. ఎల్లప్పుడూ మూత ఉన్న డస్ట్‌బిన్‌నే వాడండి. ఇంట్లో ఎక్కవ సమయం చెత్తను ఉంచకండి. ఇవి కీటకాలతో పాటు అనారోగ్యానికి కూడా కారణం అవుతాయి. ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బొద్దింకల బాధ నుంచి ఈజీగా తప్పించుకొవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us