ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

| Edited By:

Nov 26, 2019 | 8:02 PM

ప్రభుత్వం తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ.. ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీ కార్మికులకు హార్ట్ ఎటాక్స్ రావడానికి, ఇతర అనారోగ్య రుగ్మతలు కూడా కారణమవుతాయని, చనిపోయిన వారందరూ ప్రభుత్వం కారణంగానే మరణించారనడానికి రుజువులు ఏమిటని సదరు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ కార్మికులను డిస్మిస్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించలేదు.. సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యూనియన్లే కాబట్టి.. వారే దీనికి బాధ్యత వహించాలని […]

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!
Follow us on

ప్రభుత్వం తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ.. ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీ కార్మికులకు హార్ట్ ఎటాక్స్ రావడానికి, ఇతర అనారోగ్య రుగ్మతలు కూడా కారణమవుతాయని, చనిపోయిన వారందరూ ప్రభుత్వం కారణంగానే మరణించారనడానికి రుజువులు ఏమిటని సదరు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ కార్మికులను డిస్మిస్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించలేదు.. సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యూనియన్లే కాబట్టి.. వారే దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు అభిప్రాయపడింది.

కాగా.. ప్రభుత్వం తీరుతోనే ఆత్మహత్యలు చేసుకున్నట్లు పలు సూసైడ్ నోట్‌లను కోర్టు ముందు ఉంచారు పిటిషనర్. 20 నుంచి 30 ఏళ్ల సర్వీసు ఉన్న వారిని కూడా అధికారులు.. కనీసం డిపోలోకి అడుగు పెట్టనివ్వడం లేదని.. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయని పిటీషనర్ పేర్కొన్నారు. కాగా.. డిపోలోకి అనుమతించక పోతే మరో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి కోర్టు వాయిదా వేసింది.