AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope: సోమవారం రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి అదృష్టం ఎలా ఉందంటే!

Horoscope Today: సోమవారం, అక్టోబర్ 12, 2026 రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు, వృషభ రాశి వారికి పదోన్నతి అవకాశాలు, మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో బిజీగా గడిచే సూచనలు ఉన్నట్లు జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. మిగిలిన రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫలితాలను తెలుసుకోండి.

Horoscope: సోమవారం రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి అదృష్టం ఎలా ఉందంటే!
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 6:37 AM

Share

మేషం రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. వృషభం రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. మిథునం వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. ఆర్థిక వ్యవహారాలు సకాలంలో చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది. బాకీలు కూడా వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవ కాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను పూర్తిచేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. అదనపు బాధ్యతల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాకు అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయానికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఇంటా బయటా పనిభారం ఉంటుంది. అత్యవసర పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు జోరందుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులను చాలావరకు చక్కబెడతారు. అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం దొరుకుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. స్వల్ప వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని విధాలుగానూ సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండకపోవచ్చు. రాజపూజ్యాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగాసాగుతాయి. ఇంటాబయటా అనుకూలతలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువులు చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీదారులపై పైచేయి సాధిస్తారు. ఇష్టమైన బంధువులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవనసర ఖర్చులను అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టి మనశ్శాంతి ఏర్పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు లాభసాటిగా పురోగ మిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన