Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (December-12-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు..
Horoscope Today (December-12-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 4 వ తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారితో పాటు ఉద్యోగుల్లో కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అనుకోని లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి సంతృప్తీ కరంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార రంగంలో కొత్తపనులను చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధికంగా శ్రమపడతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. అన్నదమ్ములతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలకు అనుకూలిస్తాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు గందరగోళానికి గురవుతారు. ఋణప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులు నెరవేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఏర్పడుతుంది.
మీన రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. అధిక శ్రమ చేస్తారు. సోదరులతో కలహాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఏర్పడతాయి.
Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. కొంతమేర పెరిగిన వెండి ధర, ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..