AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిరిండియా విమానాలు రావద్దన్న హాంగ్ కాంగ్..!

ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ నిషేధం విధించింది. భారతదేశం నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హాంగ్ కాంగ్ ప్రభుత్వం వెల్లడించింది.

ఎయిరిండియా విమానాలు రావద్దన్న హాంగ్ కాంగ్..!
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 6:35 PM

Share

ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ నిషేధం విధించింది. భారతదేశం నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హాంగ్ కాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో విమానాల రాకపోకలపై అంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 3 వరకు ఎయిరిండియాతో పాటు కాథే డ్రాగన్ విమానాలపై కూడా నిషేధం విధిస్తున్నట్లు హాంగ్ కాంగ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 18న భారత్‌కు చెందిన ఐదుగురు ప్రయాణికులు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంగ్ కాంగ్ చేరుకున్నారు. ఈ ఐదుగురికి కొవిడ్ టెస్టు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఈ ట్రిప్‌కు ముందు వీరు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని హాంగ్ కాంగ్ ప్రకటించింది.

ఇక ఇటీవల హాంగ్ కాంగ్‌లో ఒకేరోజు 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. వీరిలో మూడో వంతు మంది బాధితులు భారత్‌ నుంచి ప్రయాణించిన వారు ఉన్నట్లు గుర్తించారు. అందుకే అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాలపై బ్యాన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులో కూడా వందే భారత్ మిషన్‌లో భాగంగా నడిపిస్తున్న ఎయిరిండియా విమానాలపై హాంగ్ కాంగ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..