ముంబైలో హోలీ వేడుకల్లో మసూద్ అజహర్, పబ్‌జి దిష్టిబొమ్మల దహనం

ముంబై : హోలికా దహనం కార్యక్రమాన్ని ముంబైవాసులు వినూత్న రీతిలో జరుపుకున్నారు. పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన జేషే మహ్మద్ అధ్యక్షుడు మసూద్ అజహర్, యువతరాన్ని పట్టి పీడుస్తున్న పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జి ల దిష్టిబొమ్మలను వర్లీ ప్రాంతానికి చెందిన యువకులు దహనం చేశారు. హోలీ సందర్భంగా వర్లీ యువకులు కలిసి కదిలి అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్, యువతరం ప్రాణాలు తీస్తున్న పబ్‌జి మొబైల్ గేమ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. సియాన్ కోలివాడ […]

ముంబైలో హోలీ వేడుకల్లో మసూద్ అజహర్, పబ్‌జి దిష్టిబొమ్మల దహనం

Edited By:

Updated on: Mar 20, 2019 | 11:57 AM

ముంబై : హోలికా దహనం కార్యక్రమాన్ని ముంబైవాసులు వినూత్న రీతిలో జరుపుకున్నారు. పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన జేషే మహ్మద్ అధ్యక్షుడు మసూద్ అజహర్, యువతరాన్ని పట్టి పీడుస్తున్న పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జి ల దిష్టిబొమ్మలను వర్లీ ప్రాంతానికి చెందిన యువకులు దహనం చేశారు. హోలీ సందర్భంగా వర్లీ యువకులు కలిసి కదిలి అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్, యువతరం ప్రాణాలు తీస్తున్న పబ్‌జి మొబైల్ గేమ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. సియాన్ కోలివాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు కలిసి ఉగ్రభూతం మసూద్ అజహర్ తోపాటు పిల్లల ప్రాణాలు తీస్తున్న పబ్ జి మొబైల్ గేమ్ దిష్టిబొమ్మలను హోలీ పండుగ వేళ దహనం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.