Bigboss 4: ఈ సీజన్ విన్నర్ అతడే.. కానీ నాకు మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు గెలవాలని ఉందంటోన్న హిమజ..

| Edited By: Balaraju Goud

Dec 20, 2020 | 6:15 PM

బిగ్‌బాస్4 సీజన్ విజేత ఎవరంటూ అటు కంటిస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తినెలకొంది. ఇప్పటికే విజేత వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి..

Bigboss 4: ఈ సీజన్ విన్నర్ అతడే.. కానీ నాకు మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు గెలవాలని ఉందంటోన్న హిమజ..
Follow us on

Himaja about bigboss 4 winner: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న బిగ్‌బాస్ 4వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లో బిగ్‌బాస్4 గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ విజేత ఎవరంటూ అటు కంటిస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తినెలకొంది. ఇప్పటికే విజేత వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇంతకు ముందు సీజన్‌లలో పాల్గొన్న కంటిస్టెంట్‌లు కూడా ఈ సీజన్ విజేత వీరే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‌బాస్3 ఫేమ్ హిమజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ నగల దుకాణ ప్రారంభంలో పాల్గొన్న హిమజ.. ఈ సీజన్ 4లో ఎవరు విన్నర్ అవుతున్నారని అడిగితే.. అభిజిత్ గెలుస్తాడని పూర్తి నమ్మకంతో తెలిపింది. అతను గెలవడానికే ఎక్కువ అవకాశాలున్నాయిని తెలిపింది. అయితే.. ఒక మహిళగా మాత్రం తాను అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక గడిచిన మూడు సీజన్లలో ఒక్క లేడీ కంటిస్టెంట్ కూడా విజేతగా నిలవలేదనే విషయం తెలిసిందే.