AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వం చాటుకున్న మహారాష్ట్ర హోంమంత్రి.. అనాథ జంటకు ‘కన్యాదానం’ జరిపించి అనిల్ దేశ్ ముఖ్

రాజకీయాలతో బిజీబిజీగా ఉండే మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. అనిల్ దేశ్ ముఖ్, ఆయన భార్య ఆదివారం నాగ్‌పూర్‌లో..

మానవత్వం చాటుకున్న మహారాష్ట్ర హోంమంత్రి.. అనాథ జంటకు ‘కన్యాదానం’ జరిపించి అనిల్ దేశ్ ముఖ్
Balaraju Goud
|

Updated on: Dec 20, 2020 | 5:11 PM

Share

రాజకీయాలతో బిజీబిజీగా ఉండే మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. అనిల్ దేశ్ ముఖ్, ఆయన భార్య ఆదివారం నాగ్‌పూర్‌లో ‘కన్యాడాన్’ కార్యక్రమం నిర్వహించారు. అనాథ బాలికను చేరదీసి శాస్త్రోత్తంగా పెళ్లి జరిపించారు. నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రేతో కలిసి హోంమంత్రి భార్య వరుడి కోసం తండ్రి విధిని నిర్వర్తించారు.

ఈ దంపతులు నాగ్‌పూర్‌లోని శ్రద్ధావాన్ లాన్‌లో జరిగిన వివాహ మహోత్సవంలో కన్యాదానం చేశారు. అనిల్ దేశ్‌ముఖ్ అతని భార్య వర్ష్ దేశ్‌ముఖ్‌లు వినికిడి లోపం ఉన్న అనాథ యువతికి వధువు తరపున, అదేవిధంగా నాగపూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే, అతని భార్య జ్యోత్స్నఠాక్రే వరుని తరపున బాధ్యత వహిస్తూ ఈ వివాహం జరిపించారు. ఈ వివాహానికి ముందు జరిగే వేడుకలన్నీ అనిల్ దేశ్‌ముఖ్ ఇంటిలో జరిగాయి. అనిల్ దేశ్‌ముఖ్ కోడలు రిద్దీ దేశ్‌ముఖ్ వధువు వర్ష, వరుడు సమీర్ లను అభినందించారు. అలాగే, వధూవరులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం శ్రద్ధావాన్ లాన్‌లో వర్షను పెళ్లికూతురు చేసే కార్యక్రమం జరిగింది. కాగా వర్ష మాదిరిగానే సమీర్ కూడా బదిరుడే విశేషం.

చెవిటి మూగవాడైన సమీర్ డోంబివాలీలో శంకర్ బాబా అనే వ్యక్తికి కనిపించాడు. దీంతో ఆయన సమీర్ కు చదువు చెప్పి, అతని సంరక్షణ బాధ్యతలు చూశారు. ఈ వివాహం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా వర్ష 23 ఏళ్ల క్రితం నాగపూర్ రైల్వే స్టేషన్‌లో అనాథగా కనిపించింది. ఆ చిన్నారి కొంతకాలం అంబాదాస్ పంత్ అనాథశరణాలయంలో ఉంది. తరువాత ఆ చిన్నారిని శంకర్‌బాబా పెంచి పోషించారు.

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్