శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో హైటెన్షన్, వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కింజరపు అప్పన్నను నామినేషన్ వేయకుండా..

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో హైటెన్షన్, వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు
Follow us

|

Updated on: Feb 02, 2021 | 4:10 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కింజరపు అప్పన్నను నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకు వచ్చారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్, నామినేషన్ కేంద్రం నుండి బలవంతంగా టెక్కలి కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను, సర్పంచ్ అభ్యర్థి అప్పన్న ను బయటకు గెంటి వేశారు. హరిప్రసాద్ అతని అనుచరులు అప్పన్నతో పాటు పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు.

ఒక దశలో దువ్వాడ శీను కారు పై దాడికి యత్నించడంతో, తప్పించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీను. టీడీపీ దాడిలో టెక్కలి సీఐ నీలయ్యకు ఫ్యాంట్ చినిగి పోయింది. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులను నెట్టుకుని లోపలికి వెళ్లారు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్. నిమ్మాడ నామినేషన్ కేంద్రంలోకి తన అనుచరులతో చొచ్చుకు వచ్చి, సర్పంచ్ అభ్యర్థి కింజరపు అప్పన్నపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.