ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులకు షాక్… బెయిల్ తిరస్కరణ

|

Jul 15, 2020 | 5:20 PM

 High Court Rejects Anticipatory Bail of Accused in ESI Scam : ఈఎస్ఐ స్కామ్‌లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులకు చుక్కెదురైంది. వారు పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈఎస్ ఐ స్కాంలో ఏ9, ఏ10 గా ఉన్న రవితేజశ్రీ, యశస్వీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి పితాని సత్యానాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, పితాని మాజీ పీఏ మురళి మోహన్ […]

ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులకు షాక్... బెయిల్ తిరస్కరణ
Follow us on

 High Court Rejects Anticipatory Bail of Accused in ESI Scam : ఈఎస్ఐ స్కామ్‌లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులకు చుక్కెదురైంది. వారు పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈఎస్ ఐ స్కాంలో ఏ9, ఏ10 గా ఉన్న రవితేజశ్రీ, యశస్వీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి పితాని సత్యానాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, పితాని మాజీ పీఏ మురళి మోహన్ ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. తాజా ఈ ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది ధర్మాసనం.

ఈ టీఎస్ఐ స్కామ్ లో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే, ఇదే కేసుకు సంబంధించి పితాని సత్యనారాయణ కుమారుడికి వెంకట సురేష్ కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇక పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నారు.