తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

|

Jun 11, 2019 | 3:06 PM

హైదరాబాద్‌: సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం వ్యవహారంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనమండలి ఛైర్మన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారని […]

తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Follow us on

హైదరాబాద్‌: సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం వ్యవహారంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనమండలి ఛైర్మన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారని షబ్బీర్‌ అలీ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. శాసన మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, ఎన్నికల సంఘంతో పాటు టీఆర్‌ఎస్‌లో విలీనమైన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌ ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి, సంతోష్‌ కుమార్‌, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఒకవేళ విలీనం చేయాలంటే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినా స్పందించలేదని ఉత్తమ్‌, భట్టి పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, సురేందర్‌, చిరుమర్తి లింగయ్య, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డిలతో పాటు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.