సామాజిక సేవలో ఎంతో ముందుంటారు నటుడు సూర్య. తాను ప్రారంభించిన అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్ చీఫ్, సూర్య గెస్ట్‌లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ యువతి ప్రసంగానికి చలించిపోయారు హీరో సూర్య.
చదువుకోవడానికి పడ్డ కష్టాలను ఆ యువతి భావోద్వేగంతో వివరించింది. నా తండ్రి చనిపోయాక, నేను కూలి పని చేసుకుంటూ నా తల్లికి సహాయపడ్డాను. అప్పుడు హీరో సూర్య నాకు సాయం చేసి ఈ స్థితిలో ఉండటానికి కారణమయ్యారని కన్నీరు పెట్టింది ఆ యువతి. దీంతో సూర్య కూడా వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. వెళ్లి ఆ యువతిని ఓదార్చారు. ఈ సీన్ కార్యక్రమానికి వచ్చిన అందర్నీ కదిలింపజేసింది. రీల్ లైఫే కాదు.. సూర్య రియల్ లైఫ్ హీరో అని పలువురు ప్రశంసించారు.