నా మీద ప్రేమతోనే అలా.. గర్వంగా ఉందన్న ప్రభాస్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. కొన్ని నెలల క్రితం ప్రభాస్ ఒక ఎయిర్ పోర్టుకు వెళ్లిన సమయంలో అక్కడ అభిమానులు ప్రభాస్‌ను చుట్టుముట్టారు. అప్పుడు ఒక అమ్మాయి ఫోటో తీసుకుని ప్రభాస్ చెంప పై చిన్నగా తట్టి పారిపోయింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ ఘటన వైరల్ అయింది. తాజాగా ఆ విషయం పై ప్రభాస్ సాహో […]

నా మీద ప్రేమతోనే అలా.. గర్వంగా ఉందన్న ప్రభాస్

Edited By:

Updated on: Aug 27, 2019 | 5:39 PM

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. కొన్ని నెలల క్రితం ప్రభాస్ ఒక ఎయిర్ పోర్టుకు వెళ్లిన సమయంలో అక్కడ అభిమానులు ప్రభాస్‌ను చుట్టుముట్టారు. అప్పుడు ఒక అమ్మాయి ఫోటో తీసుకుని ప్రభాస్ చెంప పై చిన్నగా తట్టి పారిపోయింది. ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ ఘటన వైరల్ అయింది. తాజాగా ఆ విషయం పై ప్రభాస్ సాహో ప్రమోషనల్ ఇంటర్వూలో స్పందించాడు. ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించగా.. ఆలాంటి సంఘటనలు తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పాడు. ఆమె నా మీద ప్రేమతో అలా చేసిందని.. అలాంటి ప్రేమను పొందినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పుడు సాహోతో తన క్రేజ్‌ను మరింత పెంచుకోనున్నాడు.