సమాజం చాలా ఇచ్చింది.. సమాజానికి తిరిగి ఇచ్చేయ్యాలి లేదంగే లావైపోతాం. ఇదీ శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు చెప్పే డైలాగ్. అయితే నిజజీవితంలోనూ ఈ డైలాగ్ తూచా తప్పక పాటించేవారు ఎంతో మంది. సినిమాలో ఈ డైలాగ్ చెప్పిన మహేశ్ నుంచి మరెంతో మంది దాన మూర్తులు తాము సంపాదించేదాంట్లో కొంత సమాజానికి పంచిపెడుతున్నారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూళన ఇలా ఎన్నో రంగాల్లో డబ్బును పంచుతూ తమ దాన గుణాన్ని చాటుకుంటున్నారు. ఇలా తమ దాన గుణంతో అభినవ కర్ణుడిగా నిలిచిన కొంతమంది వ్యాపార వేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
2022 లెక్కల ప్రకారం హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడర్ అత్యధికంగా దానాలు చేసిన వారి జాబితాలో మొదటి వరుసలో ఉన్నారు. ఈయన ఏకంగా రూ. 1161 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఈయన రోజుకు ఏకంగా రూ. 3 కోట్లను దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. శివనాడర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో డబ్బును పంచుతున్నారు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వారి కుటుంబ. వీరు విద్య రంగానికి ఏకంగా రూ. 484 కోట్లను ఖర్చు చేశారు. ఇక రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముకేశ్ అంబానీ కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈయన విద్యా రంగ అభివృద్ధికి రూ. 411 కోట్లను ఖర్చు చేశారు.
కుమార్ మంగలం బిర్లా అండ్ ఫ్యామిలీ ఆరోగ్యరంగానికి ఒక్క ఏడాదిలోనే రూ. 242 కోట్లు ఖర్చు చేసే నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే ఆరోగ్య రంగానికి రూ. 213 కోట్లను దానంగా అందించి సుస్మిత అండ్ సుబ్రోటో బాగ్చీ ఐదో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో వరుసగా రాధా అండ్ ఎస్ పార్థశారథీ ఆరోగ్య రంగానికి రూ. 213 కోట్లు, గౌతమ్ అధానీ అండ్ ఫ్యామిలీ విద్యా రంగానికి రూ. 190 కోట్లు, అనిల్ అగర్వాల్ అండ్ ఫ్యామిలీ కోవిడ్ 19 రిలీఫ్‌కు రూ. 159 కోట్లు, ఎమ్‌నాయక్ హెల్త్ కేర్ రంగానికి రూ. 142 కోట్లు దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..