పవన్ వేణు మాధవ్‌ల మధ్య ఒప్పందం.. అదేంటంటే?
ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి టాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలందరితోనూ ఆయన పని చేశారు. ఎంతో మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మంచితనం గురించి సినీ ప్రముఖులు గుర్తు చేసుకుని స్మరించుకున్నారు. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, వేణు మాధవ్ మధ్య ఉన్న స్నేహబంధం.. ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఓ వార్త […]

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతి టాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలందరితోనూ ఆయన పని చేశారు. ఎంతో మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మంచితనం గురించి సినీ ప్రముఖులు గుర్తు చేసుకుని స్మరించుకున్నారు. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, వేణు మాధవ్ మధ్య ఉన్న స్నేహబంధం.. ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో వేణు మాధవ్ తన స్వస్థలం కోదాడ పరిసర ప్రాంతాల్లో 10 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. ఆ పొలాన్ని తన బంధువులతో సాగు చేయించేవాడు. దానిలో పండిన ధాన్యాన్ని బియ్యం పట్టించి హైదరాబాద్‌కు వేణు మాధవ్ తీసుకొచ్చేవాడట. ఇక ఆ బియ్యం నుంచి ఒక బస్తాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంటికి పంపించేవాడు. తన పొలంలో పండిన పంట అని వేణు మాధవ్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ స్వీకరించేవాడు. ఇలా ఇద్దరి మధ్య ఈ పద్దతి కొనసాగుతూ వచ్చింది.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది తన మామిడి తోటలో పండిన మామిడి పండ్లను స్నేహితులకు పంపించేవాడు. అలా వేణు మాధవ్‌కు కూడా ఎంతో ఆప్యాయంగా ఇచ్చేవాడట. ఇద్దరి మధ్య ఒప్పందం మాదిరి పవన్ కళ్యాణ్ మామిడి కాయలు.. వేణు మాధవ్ బియ్యం చాలా ఏళ్ళ పాటు ఇచ్చి పుచ్చుకునేవారని ఇద్దరికీ తెలిసిన ఓ సన్నిహితుడు మీడియాకు తెలియజేశాడు. ‘అన్నవరం’ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని.. వీరిద్దరి మధ్య ఎన్నో సరదా సంఘటనలు జరిగాయని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.



