దారుణం..హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి..

| Edited By: Srinu

Nov 27, 2019 | 1:55 PM

ఆఫ్రికాలోని మాలిలో  దారుణం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యుద్ధ హెలికాప్టర్లు అనుకోకుండా ఢీకొన్నాయి. బుర్కినా ఫాసో, నైజర్ సరిహద్దుల సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దీంతో 13 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆరుగురు అధికారులు, ఆరుగురు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లలతో పాటు మాస్టర్ కార్పోరల్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ […]

దారుణం..హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి..
Follow us on

ఆఫ్రికాలోని మాలిలో  దారుణం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యుద్ధ హెలికాప్టర్లు అనుకోకుండా ఢీకొన్నాయి. బుర్కినా ఫాసో, నైజర్ సరిహద్దుల సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దీంతో 13 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆరుగురు అధికారులు, ఆరుగురు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లలతో పాటు మాస్టర్ కార్పోరల్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికులు కుటుంబాలకు దేశం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఉత్తరాన కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన నేపథ్యంలో 2013 నుండి వేలాది మంది ఫ్రెంచ్ దళాలు మాలిలో మోహరించాయి. అప్పటి నుండి మాలి సైన్యం కొద్దికొద్దిగా భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుటుంది.