వడోదరాలో భారీ వర్షాలు.. కాలనీల్లో తేలుతున్న మొసళ్లు..

| Edited By:

Aug 01, 2019 | 2:11 PM

భారీ వర్షాల కారణంగా గుజరాత్ నీట మునిగింది. ముఖ్యంగా గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్థవ్యస్తమైంది. మరోవైపు జనావాసాల్లోకి మొసళ్లు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో పలు ఇళ్లను ఖాళీ చేయించారు. వరదల ధాటికి వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వడోదర మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు […]

వడోదరాలో భారీ వర్షాలు.. కాలనీల్లో తేలుతున్న మొసళ్లు..
Follow us on

భారీ వర్షాల కారణంగా గుజరాత్ నీట మునిగింది. ముఖ్యంగా గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్థవ్యస్తమైంది. మరోవైపు జనావాసాల్లోకి మొసళ్లు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో పలు ఇళ్లను ఖాళీ చేయించారు. వరదల ధాటికి వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వడోదర మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. రానున్న రెండు రోజులు గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.