ముంబై ప్రజలతో ఆడుకుంటున్న వర్షాలు..! వాయిదా పద్దతిలో..

వర్షం.. ముంబై ప్రజల్ని మళ్లీ ఆడుకుంటుంది. వాయిదా పద్దతిలో ముంబైకి చుక్కలు చూపిస్తోంది. ప్రజెంట్ ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లాస్ట్ 24 గంటల్లో మహబలేశ్వర్‌లో అత్యధికంగా 241 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇటు సెంట్రల్ రాజస్థాన్‌లో సైక్లోనిక్ సర్క్యూలేషన్ ప్రభావం కొనసాగుతోంది. దీంతో.. రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోథ్‌పూర్‌లో 24 గంటల క్రితం 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం గుజరాత్‌పై కూడా పడుతోంది. దీంతో.. గుజరాత్‌లో మోస్తారు వర్షాలు ఒకటి […]

ముంబై ప్రజలతో ఆడుకుంటున్న వర్షాలు..! వాయిదా పద్దతిలో..

Edited By:

Updated on: Jul 29, 2019 | 6:57 PM

వర్షం.. ముంబై ప్రజల్ని మళ్లీ ఆడుకుంటుంది. వాయిదా పద్దతిలో ముంబైకి చుక్కలు చూపిస్తోంది. ప్రజెంట్ ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లాస్ట్ 24 గంటల్లో మహబలేశ్వర్‌లో అత్యధికంగా 241 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇటు సెంట్రల్ రాజస్థాన్‌లో సైక్లోనిక్ సర్క్యూలేషన్ ప్రభావం కొనసాగుతోంది. దీంతో.. రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోథ్‌పూర్‌లో 24 గంటల క్రితం 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం గుజరాత్‌పై కూడా పడుతోంది. దీంతో.. గుజరాత్‌లో మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాజస్థాన్ నుండి మాన్‌సూన్ ట్రఫ్ అక్షం.. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌ఘర్, ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు ఉంది. అంతేకాకుండా ఛత్తీస్‌ఘర్‌లో సైక్లోనిక్ సర్క్యూలేషన్ కొనసాగుతుంది. దీంతో.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.