AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. మంగళ, బుధవారాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. మంగళ, బుధవారాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap And Telangana Latest Weather Report
Anand T
|

Updated on: Aug 03, 2026 | 6:56 PM

Share

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనేర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ, సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని.. అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణం ఈ క్రింది విధంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం

1వ రోజు (03-08-2026): తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే వర్షాల సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది

2వ రోజు (04-08-2026): మంగళవారం కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది, వర్షాల సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది

3వ రోజు (05-08-2026): ఇక బుధవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని. అలాగే వర్షాల సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 గంటలు వాతావరణం

అటు ఏపీనూ రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

అలాగే శ్రీకాకుళం, మన్యం,కాకినాడ,కోనసీమ,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని. ముఖ్యంగా అరకు, చింతపల్లె, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us