హైదారాబాద్‌లో భారీ వర్షం

| Edited By:

Oct 08, 2019 | 7:04 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే.. మధ్యాహ్నం కూడా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షంతో.. ప్రజలు భయాందోళన చెందారు. నగరంలోని బేగంపేట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఈసీఎల్, బోరబొండ, మోతీ నగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఈఎస్‌ఐ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరకూ నీరు చేరింది. వర్షంతో నడకదారి వ్యక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా.. గత […]

హైదారాబాద్‌లో భారీ వర్షం
Follow us on

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే.. మధ్యాహ్నం కూడా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షంతో.. ప్రజలు భయాందోళన చెందారు. నగరంలోని బేగంపేట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఈసీఎల్, బోరబొండ, మోతీ నగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఈఎస్‌ఐ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరకూ నీరు చేరింది. వర్షంతో నడకదారి వ్యక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా.. గత వారం రోజులుగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా.. భారీ వర్షాలు పడుతున్నాయి.