తడిసి ముద్దైన ముంబై

ముంబై మహా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎటు చూసినా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రవాహానికి కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు సైతం కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముంబైలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. […]

తడిసి ముద్దైన ముంబై

Edited By:

Updated on: Jul 01, 2019 | 1:05 PM

ముంబై మహా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎటు చూసినా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రవాహానికి కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు సైతం కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముంబైలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. వరద ప్రవాహానికి పలుచోట్ల రోడ్లు జలమయమవ్వడంతో.. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దాదర్, బాంద్రా, చెంబూర్, వడాల, కుర్లా, థానే తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంధేరీ సబ్‌వే ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ టీం అప్రమత్తమై పైపుల ద్వారా నీటిని తొలగిస్తోంది. కుర్లాలోని రోడ్డు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.

మరోవైపు వర్షం కారణంగా ఇప్పటికే పలు ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్ల రాకపోకలకు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో సియోన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం ఎత్తుకు వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఈ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. అటు లోకల్ ట్రైన్లు, సబ్ అర్బన్ ట్రైన్లను నిలిపివేశారు. విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.