ప్రకాశంబ్యారేజి లంక గ్రామాల్లోకి నీళ్లు.. అధికారుల అలర్ట్

|

Oct 15, 2020 | 11:27 AM

ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వరద నీటితో నిండిపోయింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా కిందనున్న కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరవై రోజుల వ్యవధిలో రెండవసారి కృష్ణా నదికి వరద వస్తూ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, అరటి వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయ తోటలు నీట […]

ప్రకాశంబ్యారేజి లంక గ్రామాల్లోకి నీళ్లు.. అధికారుల అలర్ట్
Follow us on

ఎగువున కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వరద నీటితో నిండిపోయింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా కిందనున్న కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరవై రోజుల వ్యవధిలో రెండవసారి కృష్ణా నదికి వరద వస్తూ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, అరటి వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయ తోటలు నీట మునుగుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు, వరద ప్రభావం ఏడు లక్షల క్కుసెక్కులు దాటే పరిస్థితి వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.