AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్ష బీభత్సంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు.

వర్ష బీభత్సంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
Balaraju Goud
|

Updated on: Oct 15, 2020 | 11:21 AM

Share

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించనున్నారు. గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. దీంతో  జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలుతో రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రినివాస్ యాదవ్, మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

అటు, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జిహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం అంచనా నివేదికలతో రావాలని సిఎం సూచించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తును పక్కా అంచనాలతో కేంద్రానికి నివేదించాలని అధికారులు భావిస్తున్నారు.