AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. రానురాను తెలంగాణతో పాటు విదేశాలల్లో కూడా బతుకమ్మ పండను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. రకారకాల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అంతేకాదు బతుకమ్మలో ఉపయోగించే ప్రతి […]

బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు.. ప్రత్యేకతలేంటో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 10:34 AM

Share

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. రానురాను తెలంగాణతో పాటు విదేశాలల్లో కూడా బతుకమ్మ పండను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. రకారకాల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు.

అంతేకాదు బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి, అందానికి ఎంగానో తోడ్పడుతాయి. మరి ఆ పూలేంటో.. వాటితో వచ్చే లాభాలేంటో చాలా మందికి తెలియదు. ముందుగా తంగేడు పూలు.. బతుకమ్మ ముందు వరసలో ఉండేవి తంగేడు పూలు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, మలబద్దకానికి ఇది మంచి ఔషదం. తంగేడు పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

రెండవది తామర పూలు.. తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్దకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమపుప్పు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.

మూడవది గునుగు పూలు.. ఇది గడ్డిజాతికి చెందిన పువ్వు. దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఇక బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. ఈ పువ్వును చర్మం పై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదు.  ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగు రంగులో ఆరుబయట పూసి ఉంటాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం గునుగు పూలు, తంగేడు పూలు అలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు.