వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

|

Apr 08, 2019 | 5:05 PM

ముంబయి: ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌  హెచ్‌డీఎఫ్‌సీ లోన్స్‌పై వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు 5-10 బేస్‌ పాయింట్ల మధ్య ఉంటుంది. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 ఉండేది.. తాజా నిర్ణయంతో అది 8.30కు చేరింది. ఒక నెల వడ్డీరేటు 8.40 నుంచి 8.30కు, మూడునెలల రేటు 8.45 నుంచి 8.40కు, ఆరునెలల రేటు 8.55 నుంచి 8.50కు, ఏడాదికి 8.75 నుంచి […]

వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
Follow us on

ముంబయి: ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌  హెచ్‌డీఎఫ్‌సీ లోన్స్‌పై వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు 5-10 బేస్‌ పాయింట్ల మధ్య ఉంటుంది. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 ఉండేది.. తాజా నిర్ణయంతో అది 8.30కు చేరింది. ఒక నెల వడ్డీరేటు 8.40 నుంచి 8.30కు, మూడునెలల రేటు 8.45 నుంచి 8.40కు, ఆరునెలల రేటు 8.55 నుంచి 8.50కు, ఏడాదికి 8.75 నుంచి 8.70కు, రెండేళ్లకు 8.85 నుంచి 8.80కు, మూడేళ్లకు 9శాతం నుంచి 8.95కు చేరింది. ఫిబ్రవరి నుంచి మార్జినల్ కాస్ట్ బేసిడ్ లెండింగ్ పద్దతుల్లో.. ఆర్‌బీఐ గత రెండు సార్లు కలిపి 50 బేస్‌ పాయింట్లును  తగ్గించింది.