డబ్బే డబ్బు.. హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు…

|

Nov 18, 2020 | 10:37 PM

సుల్తాన్ బజార్‌లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న..

డబ్బే డబ్బు.. హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు...
Follow us on

Hawala Money Seized : హైదరాబాద్‌లో మరోసారి హవాల డబ్బులు కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.  రెండు వేరు వేరు ఘటనల్లో హవాలా కేసుల్లో 34 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సుల్తాన్ బజార్‌లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 21 లక్షల రూపాయలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో 13 లక్షల రూపాయలను పట్టుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అనుమతి పత్రాలు లేకుండా డబ్బులు, విలువైన వస్తువులు తరలిస్తే సీజ్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.