Haryana Government: దేశంలో కరోనా ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూల్స్‌ను నవంబర్ 30 వరకు మూసి ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
హర్యానా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా తగ్గకపోవడం.. సెకండ్ వేవ్‌పై డాక్టర్లు హెచ్చరించడంతో అక్కడి సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, నిన్న హర్యానాలో కొత్తగా 2,212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,09,251కి చేరింది. అంతేకాదు హర్యానాలో ఇప్పటిదాకా వైరస్ కారణంగా 2,113 మంది మరణించారు.
Also Read:
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..