ఖట్టర్ చేతి దురుసు

| Edited By:

Jun 06, 2019 | 5:47 PM

సెల్ఫీ.. ఇప్పుడు దీని క్రేజ్ అంతా ఇంతా కాదు. వీఐపీలు, పోలిటీషయన్స్, సినీ ప్రముఖులు.. ఇలా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారితో ఓ సెల్ఫీ దిగాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఆ వీఐపీలు సెల్ఫీ తీసుకుందామనుకున్న వారిపై చేయి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో రిపీట్ అయ్యింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహనం కోల్పోయారు. ఓ అభిమాని.. సీఎం దగ్గరకు […]

ఖట్టర్ చేతి దురుసు
Follow us on

సెల్ఫీ.. ఇప్పుడు దీని క్రేజ్ అంతా ఇంతా కాదు. వీఐపీలు, పోలిటీషయన్స్, సినీ ప్రముఖులు.. ఇలా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారితో ఓ సెల్ఫీ దిగాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఆ వీఐపీలు సెల్ఫీ తీసుకుందామనుకున్న వారిపై చేయి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో రిపీట్ అయ్యింది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహనం కోల్పోయారు. ఓ అభిమాని.. సీఎం దగ్గరకు వచ్చిసెల్ఫీ తీసుకోబోతుండగా.. ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాదాలను తాకి.. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఆ యువకుడిని అడ్డుకుని దురుసుగా అతని చేతిని తోసివేశారు. ఈ సంఘటన హర్యానాలోని కర్నాల్‌లో చోటు చేసుకుంది. అయితే ఈయన సహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇద్దరు దంపతులు తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించేందుకు సీఎం వద్దకు వచ్చిన సమయంలో ఆయన చిరాకు పడ్డారు. ఖట్టర్ గారి తాజా యవ్వారం చూస్తే.. బాలయ్య గుర్తుకు రావడం లేదూ…?