మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు టిఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారని, వారిని తమ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అన్నారు మంత్రి హరీష్ రావు. ముంపు బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి 70% నష్టపరిహారం అందిందని.. ఎన్నికలు వచ్చిన్నప్పుడే ప్రతిపక్షాలకు ముంపు బాధితులు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. రామలింగారెడ్డి వైపే ప్రజలు ఉన్నారని హరీశ్ అన్నారు. దుబ్బాక అభివృద్ధిలో వెనుక బడిందని ప్రతిపక్షాలు అనడం విడ్డురమని.. ప్రతిపక్షాలకి ఉప ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, ఇలాంటి కాయకొరుకుడు మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి మరోసారి ధీమా వ్యక్తం చేశారు.