రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిందని.. ఆశ్రమాన్నే కూల్చేశారు..!

| Edited By:

Sep 25, 2019 | 10:52 AM

రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను కూడా నేలమట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజీపీ, ఆరెస్సెస్ వంటి హిందూ ధార్మిక సంఘాలు ఆ చుట్టుపక్కలకు రాకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను […]

రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిందని.. ఆశ్రమాన్నే కూల్చేశారు..!
Follow us on

రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంగా ఉందని యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు కూల్చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆశ్రమంతోపాటు అందులోని రాధాకృష్ణ జగన్నాథ మందిరాలను కూడా నేలమట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజీపీ, ఆరెస్సెస్ వంటి హిందూ ధార్మిక సంఘాలు ఆ చుట్టుపక్కలకు రాకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుతో పాటు నలువైపులా నుంచి వచ్చే రహదారులను కలుపుతూ ఆరు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంతో అడ్డువచ్చిన ఇళ్లు, షాపులను నేలమట్టం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారం అందిస్తోంది.

కాగా, ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ అనే వ్యక్తి 1995లో భూమిని కొనుగోలు చేసి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ నిత్యం అఖండ హరినామ సంకీర్తనలు జరుగుతుంటాయి. యాదాద్రి అభివృద్దిలో భాగంగా చేపట్టిన రీజనల్ రోడ్డు నిర్మాణానికి హరే రామ హరే కృష్ణ ఆశ్రమం అడ్డువస్తోంది. ఈ స్థల అప్పగింత విషయంలో రెవెన్యూ అధికారులు, ప్రభూజీ మధ్య వివాదం నడుస్తోంది. కాగా, కోటి రూపాయల నష్టపరిహారం మంజూరు చేసినప్పటికీ ప్రభూజీ తిరస్కరించారని.. దీంతో ఆ పరిహారాన్ని భూ సేకరణ అథారిటీ కోర్టులో జమచేసి.. ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డీవో అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తులు దీనిపై స్పందించలేదు. అందుకే అధికారుల ఆదేశాల ప్రకారం ఆశ్రమాన్ని నేటమట్టం చేశామని ఆర్డీవో తెలిపారు. ఇక ఆశ్రమంలోని కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామాగ్రిని యాదాద్రి దేవస్థానికి తరలించారు.