గణపతి బప్పా మోరియా…

| Edited By:

Sep 02, 2019 | 6:04 AM

వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభాయ అంటే ఆర్థులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. కార్యం నిర్విఘ్నంగా జరిగేందుకు వినాయకుడు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం. బుద్ధిబలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ. ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం. గణపతిని పూజించడానికి వినాయక చవితినాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. […]

గణపతి బప్పా మోరియా...
Follow us on

వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభాయ అంటే ఆర్థులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. కార్యం నిర్విఘ్నంగా జరిగేందుకు వినాయకుడు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం. బుద్ధిబలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ. ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం. గణపతిని పూజించడానికి వినాయక చవితినాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. గణపతి.. ప్రథమ దేవుడు.. ఏ కార్యానికైనా అవరోధాలను తొలగించి సిద్ధినీ.. బుద్ధినీ ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద ప్రమాణం. పూజగానీ.. యజ్ఞంగానీ లోకకల్యాణం కోసం చేస్తారు. ఆరాధించే దేవతా గణానికీ.. మంత్ర సమూహానికీ.. యాజ్ఞికుల బృందానికీ ప్రభువై.. ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతిగా చెప్పుకుంటారు. సమస్త చేతన.. అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరిపినప్పటికీ భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజే ఎందుకంటే.. అది వినాయకుడు పుట్టినరోజు.. ఇంకా విఘ్నరాజత్వం సంప్రాప్తించిన రోజు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మహదాదితత్తాలకు ఆయన అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు.