కిచ్చా సుదీప్ కు శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజుకూడా ఇవాళే. కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ సినిమా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించాడు సుదీప్.

కిచ్చా సుదీప్ కు శుభాకాంక్షల వెల్లువ
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 02, 2020 | 9:16 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజుకూడా ఇవాళే. కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ సినిమా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించాడు సుదీప్. ఆయన బర్త్ డే సందర్భంగా వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు.. సెలబ్రెటీలు తమ విషెస్ తెలియపరుస్తున్నారు. #HappyBirthdaykicchasudeep అంటూ తమ శుభాకాంక్షలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ‘ఈగ’ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి మరీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు సుదీప్. ‘బాహుబలి’, ‘సైరా’ ఇలా అనేక భారీ సినిమాల్లోనూ సుదీప్ తానేంటో చాటాడు. ఈ కన్నడ హీరో అటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకుని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో పుట్టిన సుదీప్ బెంగుళూరు లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. యూనివర్శిటీ లెవెల్ లో మంచి క్రికెట్ ఆటగాడు కూడా. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, బుల్లితెర హోస్ట్ గా తానేంటో చూపిస్తున్నాడు. ఇలాగే భవిష్యత్ లోనూ మంచి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.. హ్యాపీ బర్త్ డే సుదీప్.