విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు

| Edited By:

Jun 30, 2019 | 11:36 AM

టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అధికార వైసీపీ చర్యలతో పచ్చ పార్టీ  ఇబ్బందులపాలవుతోంది. ఇప్పటికే అక్రమనిర్మాణం పేరిట ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం .. పలు అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా విశాఖ టీడీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ స్ధలాన్ని కబ్జా చేసి దీన్ని కట్టారంటూ  జీవిఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై  నాలుగు రోజుల్లోగా స్పందించకపోతే కూల్చివేస్తామంటూ హెచ్చరించారు. వీటితో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలకు చెందిన […]

విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు
Follow us on

టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అధికార వైసీపీ చర్యలతో పచ్చ పార్టీ  ఇబ్బందులపాలవుతోంది. ఇప్పటికే అక్రమనిర్మాణం పేరిట ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం .. పలు అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా విశాఖ టీడీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ స్ధలాన్ని కబ్జా చేసి దీన్ని కట్టారంటూ  జీవిఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై  నాలుగు రోజుల్లోగా స్పందించకపోతే కూల్చివేస్తామంటూ హెచ్చరించారు. వీటితో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలకు చెందిన భవనాలకు కూడా ఇదే విధమైన నోటీసులు జారీచేశారు.

గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది.ఈ నేపధ్యంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చివేస్తామని సీఎం జగన్ ఇటీవల హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో అధికారులు మరింత స్పీడుగా ముందుకు కదులుతున్నారు.