బీజేపీలో జీవిఎల్ చిచ్చు.. కానీ కన్నాదే పైచేయి

|

Jan 09, 2020 | 6:01 PM

ఏపీ బీజేపీలో రాజధాని అంశం చిచ్చు రాజేసింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నేతలు చెబుతుంటే.. అధికార ప్రతినిధిగా చెబుతున్నా.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. జీవీఎల్ ప్రకటన బీజేపీలో చిచ్చు రేపింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి చెబుతుంటే.. వారిని కాదని.. తాను చెప్పిందే పార్టీ అధికారిక వైఖరి అంటూ జీవీఎల్ ఘంటాపథంగా […]

బీజేపీలో జీవిఎల్ చిచ్చు.. కానీ  కన్నాదే పైచేయి
Follow us on

ఏపీ బీజేపీలో రాజధాని అంశం చిచ్చు రాజేసింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నేతలు చెబుతుంటే.. అధికార ప్రతినిధిగా చెబుతున్నా.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. జీవీఎల్ ప్రకటన బీజేపీలో చిచ్చు రేపింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి చెబుతుంటే.. వారిని కాదని.. తాను చెప్పిందే పార్టీ అధికారిక వైఖరి అంటూ జీవీఎల్ ఘంటాపథంగా ప్రకటించారు.

జీవీఎల్ ప్రకటనతో ఎటూ పాలుపోని ఏపీ బీజేపీ నేతలు.. ఏకంగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలో వున్న పరిస్థితికి అనుగుణంగా తాము స్టేట్ యూనిట్‌గా నిర్ణయం తీసుకుంటే.. మధ్యలో ఢిల్లీ నుంచి వచ్చి తాను చెప్పిందే వేదమన్నట్లు జీవీఎల్ ప్రకటించడమేంటని పలువురు నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గంలోని కీలక నేతల దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారట. దాంతో అధిష్టానం జీవీఎల్ నోటికి తాళం వేసి.. రాజధాని ఒక్కటే కాదు.. ఏపీ విషయంలో ఏ అంశమైనా స్టేట్ యూనిట్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిందే ఫైనల్ స్టాండ్ అని బీజేపీ ఏపీ లీడర్లకు క్లారిటీ ఇచ్చారట.

కన్నా ఆదేశాల మేరకు కార్యక్రమాలలో పాల్గొనాలని కూడా ఏపీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ఢిల్లీ కమలం పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ మేరకు రాజధాని తరలింపును వ్యతిరేకించడమే ఏపీ బీజేపీ ప్రజెంట్ స్టాండ్ అన్న క్లారిటీ క్యాడర్‌కు వచ్చేసిందని అంటున్నాయి కమలం పార్టీ వర్గాలు.