”కరోనా మృతుల అంత్యక్రియలకు భయపడవద్దు”..

|

Aug 20, 2020 | 6:09 PM

కరోనా వైరస్ నుంచి సుమారు 95 శాతం మంది కోలుకుంటున్నారని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్‌కి వస్తే కరోనాను జయించవచ్చునని స్పష్టం చేశారు.

కరోనా మృతుల అంత్యక్రియలకు భయపడవద్దు..
Follow us on

Guntur Joint Collector Dinesh Kumar: కరోనా వైరస్ నుంచి సుమారు 95 శాతం మంది కోలుకుంటున్నారని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్‌కి వస్తే కరోనాను జయించవచ్చునని స్పష్టం చేశారు. అంతేకాకుండా నగరంలోని నాలుగు డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆక్సిజన్ శాతాన్ని పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు.అలాగే అరగంటలో బెడ్ కల్పించకపోతే హెల్ప్ లైన్ నెంబర్ 104కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుందని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని.. ప్రస్తుతం డెత్ రేట్ 1.1 శాతంగా ఉందని గుంటూరు జాయింట్ కలెక్టర్ తెలిపారు.

కాగా, కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పీపీఈ కిట్స్ ధరించి వైద్యుల సూచన మేరకు అంత్యక్రియలు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించారు. ఇక మృతి చెందిన వారిని రవాణా చేసే సమయంలో ఇబ్బందులు వస్తున్నట్లు గమనించామన్న ఆయన.. మృతదేహాలను తరలించే ప్రైవేటు వాహనాలకు ప్రత్యేక కమిటీ నిర్ణీత ధరను నిర్ణయిస్తుందన్నారు. అటు అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చి పేద మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.

Also Read:

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..