శభాష్ పోలీస్ అన్నా…

పోలీస్.. న్యాయానికి, ధర్మానికి, త్యాగానికి మాత్రమే చిహ్నం కాదు.. ఆపదలో ఉన్న ప్రజలను కూడా ఆదుకోడానికి కూడా కేరాఫ్ అని రుజువు చేశాడు ఓ పోలీస్. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం […]

శభాష్ పోలీస్ అన్నా...
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 11, 2019 | 4:23 PM

పోలీస్.. న్యాయానికి, ధర్మానికి, త్యాగానికి మాత్రమే చిహ్నం కాదు.. ఆపదలో ఉన్న ప్రజలను కూడా ఆదుకోడానికి కూడా కేరాఫ్ అని రుజువు చేశాడు ఓ పోలీస్. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అలా ఓ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ చోట ఇద్దరు చిన్నారులు భయాందోళనలో కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. ఒడ్డుకు చేరే పరిస్థితే లేదు. తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పృథ్విరాజ్ సింగ్ జడేజా అనే పోలీస్ కానిస్టేబుల్ తన భుజాలపైకి ఎత్తుకుని గట్టుకు చేర్చారు. ఆ ఇద్దరు చిన్నారులను కింద పడకుండా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చిన ఘటనను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన ఆయన.. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ సింగ్ జడేజా ఓ ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వారి నిబద్ధతను అంతా అభినందించండంటూ సీఎం విజయ్‌ రూపానీ ట్వీట్ చేశారు.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..