పెళ్లి కొడుకుపై స్నేహితుల దారుణం.. అడిగినంత మద్యం తాగించలేదంటూ అకృత్యం.. కత్తితో పొడిచి మరీ..!

|

Dec 16, 2020 | 6:54 PM

మద్యం తాగించమని అడిగితే వద్దు అని వాదించినందుకు ఏకంగా పెళ్లి కొడుకునే హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో ఇటీవల చోటుచేసుకుంది.

పెళ్లి కొడుకుపై స్నేహితుల దారుణం.. అడిగినంత మద్యం తాగించలేదంటూ అకృత్యం.. కత్తితో పొడిచి మరీ..!
Follow us on

మద్యం తాగించమని అడిగితే వద్దు అని వాదించినందుకు ఏకంగా పెళ్లి కొడుకునే హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అలిఘర్‌కు సమీపంలో ఉన్న పలిముకిమ్ పుర్ గ్రామంలో 28 ఏళ్ల బబ్లు అనే వ్యక్తి అతని వివాహం ముగిసిన తర్వాత స్నేహితులను కలవడానికి వెళ్లాడు. అదే సమయానికి అతని స్నేహితులంతా మద్యంలో మునిగి తేలుతున్నారు. బబ్లు వెళ్లగానే ఇంకా మద్యం తెప్పించమని అడిగారు. అయితే అప్పటికే స్నేహితులంతా ఫుల్లుగా తాగి ఉండడంతో వద్దు అని బబ్లు వారించాడు. దీంతో చిన్న వాదనగా మొదలైన ఆ సంభాషణ కాస్తా వివాదానికి దారి తీసింది. దీంతో మాట మాట పెరిగి అందులోని ఒక వ్యక్తి బబ్లును కత్తితో పొడిచాడు. దీంతో బబ్లును వెంటనే స్థానికంగా ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బబ్లూ ఆసుపత్రికి చేరేలోపే మరణించాడు. దీంతో పెళ్లి కొడుకు ఇంట విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో కళకళలాడిన పెళ్లి ఇళ్లు ఒక్కసారిగా బంధువుల ఆర్తనాదాలతో నిండిపోయింది.

ఈ ఘటనలో ప్రాధాన నిందితుడైన రామ్‌ఖిలాడీని అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ నరేష్ సింగ్ తెలిపారు. రామ్‌తో పాటు హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న మిగతా ఐదురుగు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని నరేష్ సింగ్ పేర్కొన్నారు.