AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కొడుకుపై స్నేహితుల దారుణం.. అడిగినంత మద్యం తాగించలేదంటూ అకృత్యం.. కత్తితో పొడిచి మరీ..!

మద్యం తాగించమని అడిగితే వద్దు అని వాదించినందుకు ఏకంగా పెళ్లి కొడుకునే హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో ఇటీవల చోటుచేసుకుంది.

పెళ్లి కొడుకుపై స్నేహితుల దారుణం.. అడిగినంత మద్యం తాగించలేదంటూ అకృత్యం.. కత్తితో పొడిచి మరీ..!
Anil kumar poka
|

Updated on: Dec 16, 2020 | 6:54 PM

Share

మద్యం తాగించమని అడిగితే వద్దు అని వాదించినందుకు ఏకంగా పెళ్లి కొడుకునే హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అలిఘర్‌కు సమీపంలో ఉన్న పలిముకిమ్ పుర్ గ్రామంలో 28 ఏళ్ల బబ్లు అనే వ్యక్తి అతని వివాహం ముగిసిన తర్వాత స్నేహితులను కలవడానికి వెళ్లాడు. అదే సమయానికి అతని స్నేహితులంతా మద్యంలో మునిగి తేలుతున్నారు. బబ్లు వెళ్లగానే ఇంకా మద్యం తెప్పించమని అడిగారు. అయితే అప్పటికే స్నేహితులంతా ఫుల్లుగా తాగి ఉండడంతో వద్దు అని బబ్లు వారించాడు. దీంతో చిన్న వాదనగా మొదలైన ఆ సంభాషణ కాస్తా వివాదానికి దారి తీసింది. దీంతో మాట మాట పెరిగి అందులోని ఒక వ్యక్తి బబ్లును కత్తితో పొడిచాడు. దీంతో బబ్లును వెంటనే స్థానికంగా ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బబ్లూ ఆసుపత్రికి చేరేలోపే మరణించాడు. దీంతో పెళ్లి కొడుకు ఇంట విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో కళకళలాడిన పెళ్లి ఇళ్లు ఒక్కసారిగా బంధువుల ఆర్తనాదాలతో నిండిపోయింది.

ఈ ఘటనలో ప్రాధాన నిందితుడైన రామ్‌ఖిలాడీని అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ నరేష్ సింగ్ తెలిపారు. రామ్‌తో పాటు హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న మిగతా ఐదురుగు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని నరేష్ సింగ్ పేర్కొన్నారు.

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే